ఎవరైనా మాజీ కాక తప్పదు: హరీష్
హైదరాబాద్ : రాజకీయాల్లో ఎవరైనా మాజీ కాక తప్పదని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయంగా లేదా రిజర్వేషన్ పరంగా అయినా మాజీలు కావొచ్చు అని, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేల వేతనాలు, మాజీల ఫించన్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కర్ణాటక తరహాలో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా పాల్గొన్నారు.