బ్యాంక్ ఖాతాల వివరాలు బయటపెట్టగలరా?
విపక్ష ప్రజాప్రతినిధులకు లక్ష్మణ్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఆయా రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నవంబర్ 1 నాటి నుంచి తమ బ్యాంకు ఖాతాల వివరాలను బయటపెట్టగలరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నానావత్ బిక్కునాద్ నాయక్, మజ్దూర్‌సెల్ అధ్యక్షుడిగా బి.చంద్రశేఖర్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నవంబర్ 8 తర్వాత నిర్వహించిన బ్యాంకు లావాదేవీల వివరాలను పార్టీకి సమర్పించాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారన్నారు. ఈ ప్రయత్నాన్ని కొన్ని పార్టీలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. గురువారం నుం చి అన్ని జిల్లాలు, మండలాల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.