అమరావతి: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసి, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోను అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తుచేశారు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు.
అలానే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇలానే సామాజిక న్యాయం పాటిస్తున్నామని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్ ఎంత కచ్చితంగా నిలబడతారో ఇదే నిదర్శనమని గుర్తుచేశారు. శాసన మండలిలో టీడీపీ అడ్డంకులు ఇక ఉండవని, ప్రభుత్వ పాలసీల అమలు ఇక నుంచి సులభతరం అవుతుందని అన్నారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని తెలిపారు.
ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్‌రెడ్డిది అని అన్నారు. పార్టీ జెండా మోసిన నమ్మకాస్తులకు అవకాశాలు ఇచ్చే నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.2006లో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారని, 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకే తనకు సీఎం జగన్ దేవుడు లాంటివారని చెప్పారు.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తొలిసారి తమ నాయుకుడు, సీఎం జగన్ శాసన మండలిలో అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు.అన్ని సామాజికవర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు.
ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ మోషేన్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని అన్నారు.బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా దక్కేలా చేశారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. కడప జిల్లాలో తొలిసారి బీసీ యాదవ వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు. సమాన్యుడైన తనను చట్టసభలుకు పంపింనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment