అట్టహాసంగా
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం
⇒ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు
⇒ కార్యకర్తల సమక్షంలో నేతల సభ్యత్వ స్వీకరణ
⇒ సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా నమోదు లక్ష్యం
⇒ వేదికపై విప్ గోవర్ధన్, కార్యకర్త రాజు జన్మదినం
⇒ ప్రతిపక్షాలపై విమర్శలు.. కేసీఆర్‌కు ప్రశంసలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిజామాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొంపల్లిలో సమావేశం నిర్వహించిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై దిశానిర్ధేశనం చేసి న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలోని భారతి గార్డెన్స్‌లో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మంత్రి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
ఆ తర్వాత మంత్రి ఎంపీ కవితకు సభ్యత్వం అందించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇదే రోజు విప్ గంప గోవర్ధ న్ పుట్టినరోజు కూడా కావడంతో వేదికపై కే క్ కట్ చేశారు. ఇంకా ఎవరిదైనా పుట్టినరో జు ఉంటే వేదికపైకి రావాలని ఎంపీ కవిత కోరడంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన రాజు అనే కార్యకర్త వేదిక పైకి వచ్చారు. దీంతో విప్‌తోపాటు రాజు కు జన్మదిన వేడుకలు జరిపి అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రసంగించిన పలువురు నేతలు ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పించారు. అదే సమయం లో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురి పించారు.
సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, షకీల్ అహ్మద్ ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 30 వేలకు తగ్గకుండా చేయాలని సభ్యులను చేర్పించాలని కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. 5 వేల క్రియా శీల, 25 వేల సాధారణ సభ్యులు తప్పనిసరిగా చేరే లా చూడాలని కోరారు. టీఆర్‌ఎస్ పటిష్టం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందూరులో ఇప్పటికే ఘన విజయం అందుకున్న పార్టీకి, సభ్యత్వ నమోదులోనూ రాష్ట్రంలో రికార్డు దక్కేలా చేయాలన్నారు.
ఈ నెల 20 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయలని, మార్చి ఒక టి నుంచి గ్రామ కమిటీలు వేసుకోవాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 12 మందితో అడహక్ కమిటీని వేసి,సభ్యుల పేర్లను మంత్రి వెల్లడించారు.మండలాలోనూ తాత్కాలిక కమిటీలను వేసుకుని గ్రామస్థాయిలో కమిటీలు వే యాలన్నారు. త్వరలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
సమావేశంలో మాట్లాడిన పలువురు నేతలు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాబోయే కా లంలో జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు నాయకులు, కార్యకర్తలు మిగలరన్నా రు. ఇతర పార్టీల కండువాలు ఉండవని, టీఆర్‌ఎస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులకు స్థానం లేదని, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఉంటే, టీఆర్‌ఎస్‌లో చేరాలన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి పుట్టగతులు ఉండవని వారు దుయ్యబట్టారు. కేసీఆర్ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశారని, ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.
విదేశాలలోనూ కేసీఆర్‌కు పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. అలాంటి నేత నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, గులాబీ కండు వా కింద పనిచేసే ప్రతి ఒక్కరికి కేసీఆర్ న్యా యం చేస్తారన్నారు. చురుకుగా పని చేసి సభ్య త్వ నమోదును పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశె ట్టి, జడ్‌పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, మేయర్ అకుల సుజాత, నాయకులు ఈగ గంగారెడ్డి, ముజీబుద్దీన్ తది తరులు పాల్గొన్నారు.