TRS membership Registration program
-
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహాలు షురూ
సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 25లోగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచే సంబంధిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నమోదయ్యే సభ్యుల్లో కనీసం 35 శాతం మందికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయిం చారు. 2019లో జరిగిన సభ్యత్వ నమోదులో 65 లక్షల మంది టీఆర్ఎస్ సభ్యులుగా నమోదు కాగా, ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని 80 లక్షలుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 50వేలకు తగ్గకుండా పార్టీ సభ్యత్వ నమోదు జరిగి తీరాలని లక్ష్యం విధించారు. ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తయితేనే మార్చిలో గ్రామ, మండల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా సభ్యత్వ నమోదును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేలకే కంప్యూటరీకరణ బాధ్యత.. పార్టీ సభ్యత్వం తీసుకునేవారికి రూ.2 లక్షల ప్రమాదబీమా కల్పిస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. గతంలో 65 లక్షల మంది పార్టీ సభ్యులుగా నమోదైనా వారి వివరాలు రాష్ట్ర కార్యాలయంలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇన్సూరెన్స్ చెల్లింపు సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు బీమా పరిహారంగా సుమారు రూ.16 కోట్ల మేర చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత కార్యకర్తల వివరాలను నియోజకవర్గస్థాయిలోనే కంప్యూటరీకరించి, వివరాలను తెలంగాణ భవన్లో అందజేయాలని పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ క్షేత్ర స్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా సేకరించాల్సిన సభ్యత్వాల సంఖ్యకు సంబంధించి క్షేత్ర స్థాయి నేతలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇన్‌చార్జ్‌లను నియమించిన విషయం తెలిసిందే. కేసీఆర్ జన్మదిన వేడుకలకు సన్నాహాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న భారీగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ‘కేసీఆర్ కప్ 2021’పేరిట వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్ జన్మదినం నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సంతోశ్ ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు టీఆర్ఎస్ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. -
గులాబీ కండువా ప్రజలకు శ్రీరామ రక్ష
⇒ చంద్రబాబుది పూటకో మాట ⇒ నిజామాబాద్ ఎంపీ కవిత ⇒ బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బెల్లంపల్లి/ఆసిఫాబాద్ : గులాబీ కండువా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లంపల్లిలోని బాలాజీ మినీ ఫంక్షన్ హాల్లో, ఆసిఫాబాద్‌లోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి వలసలు ఆరంభమయ్యాయని, పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. ఒక్కో కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేర్పించాలని, గడపగడపకు వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుది పూటకో మాట అని విమర్శించారు. సమయాన్ని బట్టి రెండు కళ్ల సిద్ధాంతం అవలంబి స్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా పార్టీలు లేని తెలంగాణ ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చా రు. ఆంధ్రా పాలనలో ఆసిఫాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం జిల్లాకు వెయ్యి కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కాగా, ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ స భ్యుడు పురాణం సతీశ్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి సయ్యద్ అక్బర్‌హుస్సేన్ , నాయకులు ఆర్.ప్రవీణ్, ఎస్.నర్సింగం, సురేశ్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు పోలు భరత్‌చంద్ర, ఆసిఫాబాద్‌లో పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జెడ్పీటీసీల ఫో రం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల హేమాజి, రైతు సంఘం నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రేణుకుంట్ల ప్రవీణ్, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి బలోపేతానికి కృషి మంచిర్యాల టౌన్ : గ్రామగ్రామాన తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. గురువారం మంచిర్యాల టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటి వరకు 1.20 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. కవిత వెంట జాగృతి తూర్పు జిల్లా అధ్యక్షుడు ప్రేంరావు, సభ్యులు తిరుమల, పుష్ప, విజయలక్ష్మి, సతీశ్, సిరిపురం రాజేశ్ ఉన్నారు. రాచకొండ కుటుంబానికి పరామర్శ శ్రీరాంపూర్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబాన్ని ఎంపీ కవిత పరామర్శించారు. నస్పూర్‌లోని వారి ఇంటికి వెళ్లి కృష్ణారావు భార్య మంజుల, పిల్లలను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట ఎమ్మెల్యే దివాకర్‌రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు పురా ణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూ మారెడ్డి, ఎంపీపీ బేర సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి ఉన్నారు. పక్క రాష్ట్ర సీఎంకు ఇక్కడేం పని..? పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు కు తెలంగాణ రాష్ట్రంతో పనేందని నిజామాబా ద్ ఎంపీ కవిత ప్రశ్నించారు. ఆంధ్ర సీఎం తెలంగాణలో పర్యటించడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇక్కడ మిగిలింది ఇద్దరు ముగ్గురే న ని.. మరి కొన్ని రోజుల్లో వారు కూడా ఉండరన్నారు. -
అట్టహాసంగా
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం ⇒ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ⇒ కార్యకర్తల సమక్షంలో నేతల సభ్యత్వ స్వీకరణ ⇒ సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా నమోదు లక్ష్యం ⇒ వేదికపై విప్ గోవర్ధన్, కార్యకర్త రాజు జన్మదినం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు.. కేసీఆర్‌కు ప్రశంసలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నిజామాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొంపల్లిలో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై దిశానిర్ధేశనం చేసి న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలోని భారతి గార్డెన్స్‌లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మంత్రి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రి ఎంపీ కవితకు సభ్యత్వం అందించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇదే రోజు విప్ గంప గోవర్ధ న్ పుట్టినరోజు కూడా కావడంతో వేదికపై కే క్ కట్ చేశారు. ఇంకా ఎవరిదైనా పుట్టినరో జు ఉంటే వేదికపైకి రావాలని ఎంపీ కవిత కోరడంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన రాజు అనే కార్యకర్త వేదిక పైకి వచ్చారు. దీంతో విప్‌తోపాటు రాజు కు జన్మదిన వేడుకలు జరిపి అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రసంగించిన పలువురు నేతలు ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పించారు. అదే సమయం లో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురి పించారు. సెగ్మెంట్‌కు 30 వేలు తగ్గకుండా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, షకీల్ అహ్మద్ ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 30 వేలకు తగ్గకుండా చేయాలని సభ్యులను చేర్పించాలని కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. 5 వేల క్రియా శీల, 25 వేల సాధారణ సభ్యులు తప్పనిసరిగా చేరే లా చూడాలని కోరారు. టీఆర్ఎస్ పటిష్టం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందూరులో ఇప్పటికే ఘన విజయం అందుకున్న పార్టీకి, సభ్యత్వ నమోదులోనూ రాష్ట్రంలో రికార్డు దక్కేలా చేయాలన్నారు. ఈ నెల 20 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయలని, మార్చి ఒక టి నుంచి గ్రామ కమిటీలు వేసుకోవాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 12 మందితో అడహక్ కమిటీని వేసి,సభ్యుల పేర్లను మంత్రి వెల్లడించారు.మండలాలోనూ తాత్కాలిక కమిటీలను వేసుకుని గ్రామస్థాయిలో కమిటీలు వే యాలన్నారు. త్వరలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సమావేశంలో మాట్లాడిన పలువురు నేతలు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాబోయే కా లంలో జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు నాయకులు, కార్యకర్తలు మిగలరన్నా రు. ఇతర పార్టీల కండువాలు ఉండవని, టీఆర్ఎస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులకు స్థానం లేదని, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఉంటే, టీఆర్ఎస్లో చేరాలన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి పనులు చేస్తుంటే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి పుట్టగతులు ఉండవని వారు దుయ్యబట్టారు. కేసీఆర్ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశారని, ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. విదేశాలలోనూ కేసీఆర్‌కు పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. అలాంటి నేత నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, గులాబీ కండు వా కింద పనిచేసే ప్రతి ఒక్కరికి కేసీఆర్ న్యా యం చేస్తారన్నారు. చురుకుగా పని చేసి సభ్య త్వ నమోదును పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశె ట్టి, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, మేయర్ అకుల సుజాత, నాయకులు ఈగ గంగారెడ్డి, ముజీబుద్దీన్ తది తరులు పాల్గొన్నారు. -
రాజకీయ ముఖచిత్రాన్ని మారుద్దాం
టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం : జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని అత్యధికంగా నమోదు చేద్దామని, ఖమ్మం రాజకీయ ముఖచిత్రాన్ని మారుద్దామని ఆ పార్టీ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ విజయవంతం కోసం గురువారం ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీని గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, గృహాలు అం దించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఖమ్మం నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయని, వీటి పరిధిలో పురుషులతో సమానంగా స్త్రీలు సభ్యత్వ నమోదులో ముందుండాలని అన్నారు. పార్టీ అభివృద్ధికి శ్రమించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. సభ్యత్వాలు చేర్పించే విషయంలో కార్యకర్తలు నిజాయితీగా వ్యవహరించాలని, రుసు ము కూడా సభ్యుని నుంచి వసూలు చేయాలని అన్నారు. సభ్యత్వ నమోదును 15 రోజుల్లో పూ ర్తిచేసి, జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు తవిడిశెట్టి రామారావు, బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు, మదార్ సాహె బ్, అర్వపల్లి విద్యాసాగర్‌రావు, శేషగిరిరావు, కొరుపల్లి శ్రీనివాస్, పగడాల నాగరాజు, సుబ్బారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.