టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం : జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అత్యధికంగా నమోదు చేద్దామని, ఖమ్మం రాజకీయ ముఖచిత్రాన్ని మారుద్దామని ఆ పార్టీ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ విజయవంతం కోసం గురువారం ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీని గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, గృహాలు అం దించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఖమ్మం నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయని, వీటి పరిధిలో పురుషులతో సమానంగా స్త్రీలు సభ్యత్వ నమోదులో ముందుండాలని అన్నారు. పార్టీ అభివృద్ధికి శ్రమించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. సభ్యత్వాలు చేర్పించే విషయంలో కార్యకర్తలు నిజాయితీగా వ్యవహరించాలని, రుసు ము కూడా సభ్యుని నుంచి వసూలు చేయాలని అన్నారు. సభ్యత్వ నమోదును 15 రోజుల్లో పూ ర్తిచేసి, జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమంగా నిలపాలని పిలుపునిచ్చారు.
ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు తవిడిశెట్టి రామారావు, బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు, మదార్ సాహె బ్, అర్వపల్లి విద్యాసాగర్‌రావు, శేషగిరిరావు, కొరుపల్లి శ్రీనివాస్, పగడాల నాగరాజు, సుబ్బారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ముఖచిత్రాన్ని మారుద్దాం
Published Fri, Feb 6 2015 5:25 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement