కలాం సేవలు చిరస్మరణీయం | Kalam services memorable: ysrcp | Sakshi
Sakshi News home page

కలాం సేవలు చిరస్మరణీయం

Published Fri, Jul 31 2015 1:25 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

కలాం సేవలు చిరస్మరణీయం - Sakshi

కలాం సేవలు చిరస్మరణీయం

మాజీ రాష్ట్రపతికి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం ఘనంగా నివాళులర్పించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని కమిటీ హాలు (నెంబర్-3)లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు కలాం సేవలను స్మరించుకుని శ్రద్ధాం జలి ఘటించారు. వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, ఆర్.రోజా తొలుత కలాం చిత్రపటం వద్ద పూలుజల్లి నివాళి అర్పించారు.

అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కలాంకు నివాళి ఘటించారు. అబ్దుల్ కలాం అమర్ రహే... అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కొరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, సుజయ్‌కృష్ణ రంగారావు, మేకా ప్రతాప అప్పారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, పోతుల రామారావు, కళత్తూరు నారాయణస్వామి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ పి.సునీల్, కలమట వెంకటరమణ, కంబాల జోగులు, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, షేక్ చాంద్‌బాషా, షేక్ బేపారి అంజాద్ బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి, టి.జయరాములు, మణి గాంధీ, వరుపుల సుబ్బారావు, గిడ్డి ఈశ్వరి, గుమ్మనూరు జయరామయ్య, ఎమ్మెల్సీలు  వీరభద్రస్వామి, సి.నారాయణరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement