సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వేతనాలు భారీగా పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వారికి లభించే వేతనాలను రెట్టింపు చేయాలన్న ఆలోచనలో ఉంది. తద్వారా వారు పైరవీలు, కాంట్రాక్టులు చేయాల్సిన అవసరం లేకుండా వచ్చే వేతనంతో తమకయ్యే వ్యయాన్ని తట్టుకుని ప్రజలకు సేవలందించడానికి వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం శాసన సభ్యులు/శాసన మండలి సభ్యులకు వేతనం, అలవెన్సులతో కలిపి రూ.95 వేల వరకు వస్తోంది. మంత్రులకు దాదాపు రూ.1.50 లక్షలు వస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం, అలవెన్సులు కలుపుకొని నెలకు రూ.2లక్షల వరకు, మంత్రులకు రూ.3 లక్షల వరకు పెంచే ఆలోచన చేస్తోంది.