హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి. ఆ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ఎమ్మెల్సీలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు.
టీఆర్ఎస్ లో చేరిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మదన్ లాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కనకయ్యలు నోటీసులు అందిన వారిలో ఉన్నారు.