
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.