
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్:ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ సోమవారం ఖరారు చేసింది. శాసనసభ కోటా నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ జాబితాలో వివి చౌదరి(తూర్పుగోదావరి), తిప్పేస్వామి( అనంతపురం), గుమ్మడి సంధ్యారాణి(విజయనగరం) పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. అయితే దీనిపై కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. కాగా, బాలయ్య సూచించిన పేర్లకు బాబు నో చెప్పారు. అబ్దుల్ ఘని, అంబికా కృష్ణల పేర్లను బాలయ్య సూచించినా వారి పేర్లను బాబు పరిగణలోకి తీసుకోలేదు.