సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.
‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్‌లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్‌లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment