సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్‌కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు పర్యటనకు వెళ్లనున్నారు.
కాగా, ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి నేతలు నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మొదటగా కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. ఈరోజు రాత్రి రామగుండంలో బీఆర్‌ఎస్ నేతల బృందం బస చేయనున్నారు. ఇక, రేపు(శుక్రవారం) బీఆర్‌ఎస్ నేతలు అందరూ కన్నెపల్లి పంపు హౌజ్‌ను సందర్శించి అనంతరం మేడిగడ్డకు బయలుదేరుతారు. కాళేశ్వరం పర్యటన ముగిసిన తర్వాత వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం ఎక్కువైంది. ఈ క్రమంలో వరదలను సైతం తట్టుకుని మేడిగడ్డ నిలబడిదంటూ బీఆర్‌ఎస్ నేతలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment