సాక్షి, రామగుండం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం రామగుండం నుంచి కన్నెపల్లి పంప్ హౌస్‌కు బీఆర్‌ఎస్ టీమ్ పయనమైంది. ఈ తర్వాత వీరంతా మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.
అయితే, కాళేశ్వరం పర్యటనకు బీఆర్‌ఎస్ నేతలు గురువారం సాయంత్రం బయలుదేరారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామగుండంలో వారంతా బస చేశారు. బీఆర్ఎస్ టీమ్ ముందుగా ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. కాగా, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద బీఆర్‌ఎస్ బృందం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక, కేటీఆర్ నేతృత్వంలో టీమ్ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.
మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. pic.twitter.com/WfoThtZssp
— KTR News (@KTR_News) July 26, 2024
మరోవైపు.. రామగుండంలో సింగరేణి క్వార్టర్స్ కోల్పోతున్న బాధితులు శుక్రవారం ఉదయం కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్స్ ప్రదర్శనలతో తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా తమ గోడును వినిపించాలని కోరారు.
ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాం.
ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి.. నీటి పంపింగ్… pic.twitter.com/0B2kaeCEUS— BRS Party (@BRSparty) July 25, 2024
రేవంతూ.. నీ అసమర్థ పాలనతో తెలంగాణను ఎడారిగా మారుస్తున్నావు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో కళకళలాడిన లోయర్ మానేరు డ్యాం..
చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీళ్లు లేక వెలవెలబోతున్నది. pic.twitter.com/X2jBcH4l28— BRS Party (@BRSparty) July 25, 2024
Comments
Please login to add a commentAdd a comment