ఎమ్మెల్యేలకు భద్రత పెంచి మాకు కుదిస్తారా? | telangana mlcs angry on security cut | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు భద్రత పెంచి మాకు కుదిస్తారా?

Published Fri, Nov 21 2014 2:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

telangana mlcs angry on security cut

హైదరాబాద్: ఎమ్మెల్సీలకు భద్రత కుదించడంపై తెలంగాణ శాసనమండలిలో శుక్రవారం గందరగోళం చెలరేగింది. ఒకే జిల్లాలో ఎమ్మెల్యేలకు భద్రతకు పెంచి ఎమ్మెల్సీలకు కుదిస్తారా అంటూ సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీల ఆందోళనతో సభలో గందరగోళం తలెత్తింది. ఎమ్మెల్సీల సెక్యురిటీపై సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీయివ్వడంతో సభ్యులు శాంతించారు. తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement