
38 విమానాలు ఆలస్యం
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పొంగ మంచు దట్టంగా కమ్మేయడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. పొంగ మంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆరు రైళ్లను రద్దు చేశారు. 51 రైళ్ల రాకపోకల సమయాన్ని మార్చారు.
వెలుతురు తగ్గిపోవడంతో ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న 3 విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సహకరించకపోవడంతో ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 38 విమానాలు ఆలస్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.