దేశరాజధానిలో ఇసుక తుఫాన్, అంధకారంలో ఢిల్లీ!
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఇసుక తుపాను భీభత్సం సృష్టించింది. ఇసుక తుఫాన్ ప్రభావంతో పట్టపగలే ఢిల్లీ లో అంధకారం అలుముకుంది. బీభత్సమైన ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గాలి దుమారంతో విద్యుత్‌కు అంతరాయం కలుగడంతో వ్యాపారస్థంస్థలు, ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని గుర్గావ్, ఇతర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.
ఈదురుగాలులతోపాటు వర్షం కూడ పడటం, రహదారులపై చెట్టు విరిగి పడటంతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఊహించని విధంగా, ఆకస్మికంగా వాతవరణ పరిస్థితులు మారిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు.