సాక్షి,రంగారెడ్డి : శంషాబాద్‌లో వరుసగా రెండోసారి చిరుత ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాంన్సీమియాగుడా గ్రామ శివారులో చిరుత అనవాళ్లు కనిపించాయి.
పొలంలో చిరుత సంచరించినట్లు రైతులు ఆనావాళ్లు గుర్తించారు. వెంటనే చిరుతను గుర్తించాలని అటవిశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అయితే అధికారులు స్పందించ లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.
కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment