
సాక్షి, శంషాబాద్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేబీ. దొడ్డికి చెందిని బైండ్ల రాజేందర్(25) అదే గ్రామానికి చెందిన యువతి(19) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో అనేక సార్లు శారీరకంగా కలిశాడు.
ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా ముఖం చాటేశాడు. ఎన్ని సార్లు పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చిన మోఖం చాటేశాడు. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment