
హైదరాబాద్: మద్యంమత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మెహిదీపట్నంకు చెందిన ఓ యువతి (25) అమీర్‌పేట్‌కు చెందిన అమీర్ సోహేల్ మహ్మ ద్ అబ్దుల్ గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు కారులో వెళ్తున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న యువతి మొదట బస్టాండ్‌లో ఓ వాహనాన్ని ఢీ కొడుతూ అదే వే గంతో కొద్ది దూరంలో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడి చేతికి గాయమైంది.
సెకన్ల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు బావర్చి ముందు నిల్చున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. అప్రమత్తమైన స్థానికులు కారుని ఆపడంతో ఇరువురు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. శ్వాస పరీక్ష చేయగా యువతికి 200, యువకుడికి 550 ఉన్నట్లు తేలింది. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment