
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్‌డౌన్‌లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్‌లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్‌లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.