
సాక్షి, శంషాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో శుక్రవారం పలువురు అమెరికన్లు 2 ఎయిరిండియా విమానాల్లో ఇక్కడి నుంచి ముంబై మీదుగా వాళ్ల దేశానికి బయలుదేరారు. మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఏఐ–1615 విమానం 69 మంది పెద్దలు, ఒక శిశువుతో ఇక్కడి నుంచి ముంబైకి బయల్దేరగా.. ఏఐ–1617 విమానం 96 మంది పెద్దలు, ఇద్దరు శిశువులతో సాయంత్రం 4.24 గంటలకు టేకాఫ్ తీసుకుంది. పూర్తి శానిటైజేషన్ చేసిన టెర్మినల్ ద్వారా వీరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు. లాక్‌డౌన్ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్గో విమానాలు కాక 5 ప్రయాణికుల విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 7న కూడా ఇక్కడి నుంచి అమెరికాకు ఓ విమానం బయలుదేరి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment