చినజీయర్‌ ఆశ్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం | Madhya Pradesh CM Shivraj Singh Chouhan Visited Chinna Jeeyar Swamy Ashram | Sakshi
Sakshi News home page

చినజీయర్‌ ఆశ్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం

Published Sun, Jan 23 2022 12:45 AM | Last Updated on Sun, Jan 23 2022 12:48 AM

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Visited Chinna Jeeyar Swamy Ashram - Sakshi

చినజీయర్‌స్వామికి నమస్కరిస్తున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 

శంషాబాద్‌ రూరల్‌: శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరం చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రుత్వికులు స్వాగతం పలికారు.

అనంతరం సీఎం దంపతులు ఆశ్రమంలో స్వామికి నమస్కరించి కానుకలు అందజేశారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను స్వామి ఆశీర్వదించి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement