న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీకి మకాం మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ సీఎం హస్తీనాకు షిఫ్ట్ అయ్యారు.
అయితే చౌహన్ నిర్ణయంతో ఆయన కుమారుడు కార్తీకే సింగ్ చౌహన్ రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బుధ్నీఅసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చౌహన్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మోరెనా నుంచి పోటీ గెలుపొందారు.
ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బుధ్నీ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీకే బరిలో దిగనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment