Budhni
-
ఢిల్లీకి మారిన శివరాజ్ సింగ్ చౌహన్.. కుమారుడికి లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీకి మకాం మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ సీఎం హస్తీనాకు షిఫ్ట్ అయ్యారు.అయితే చౌహన్ నిర్ణయంతో ఆయన కుమారుడు కార్తీకే సింగ్ చౌహన్ రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బుధ్నీఅసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చౌహన్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మోరెనా నుంచి పోటీ గెలుపొందారు. ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బుధ్నీ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీకే బరిలో దిగనున్నట్లు సమాచారం. -
‘భయపడకండి.. పులి బతికే ఉంది’
భోపాల్ : ఎవరూ భయపడకండి.. పులి బతికే ఉంది అంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పులి బతికి ఉండటానికి.. చౌహాన్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఓడిపోయిన వారికి ధైర్యం చెబుతారు. కానీ చౌహాన్ మాత్రం వెరైటీగా ప్రజలకు ధైర్యం చెబుతూ తనను తాను పులిగా చిత్రికరించుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి బుధ్ని నియోజకవర్గంలో పర్యటించిన చౌహాన్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఎవరు భయపడకండి.. మీకు ఏం కాదు. నేకు ఇక్కడే ఉన్నాను. పులి ఇంకా బతికే ఉందం’టూ సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ సినిమా డైలాగ్‌లు చెప్పారు. అయితే ఇలా చమత్కారంగా మాట్లాడటం చౌహాన్‌కు కొత్తేం కాదు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘తుమ్ తో ఠహరే పర్దేసీ సాథ్ క్యా నిభాఓగే’ అంటూ పాత హిందీ సినిమా పాట పాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదేశీయుడంటూ ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పూర్తి బాధ్యత తనదేనంటూ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బరిలో నిలిచిన బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో ఆయన హవా కొనసాగుతుంది. బుధ్నిలో ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేంద్ర సింగ్ చౌహాన్ కంటే 12,777 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే విదిశలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశాంక్ భార్గవ కంటే దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో బుధ్నినియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపోందారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే గతంలో విదిశ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభకు ఎన్నికైయ్యారు. బీజేపీ గట్టిపట్టున్న విదిశ లోక్ సభ నియోజకవర్గానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.