
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లోకి కార్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయన అక్కడ లేని సమయంలో గేటు వద్ద ఉన్న వాచ్‌మెన్‌తో మోహన్‌బాబును ఉద్దేశించి పలు హెచ్చరికలు చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి గ్రామ శివారులో సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన మంచు టౌన్‌షిప్ పేరుతో నివాసం ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో లోపలి నుంచి బైక్ బయటకు వెళ్లడానికి వాచ్‌మెన్ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో బయట నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు లోనికి ప్రవేశించింది. ఇది గమనించిన వాచ్‌మెన్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో కారులో ఉన్నవారు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని డోర్ తెరిచి దూషిస్తూ వేగంగా వెళ్లిపోయారు. వాచ్‌మెన్ ఇచ్చిన సమాచారంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ‘ ఏపీ 31 ఏఎన్ 0004 ’ నంబరు గల కారులో దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment