
సాక్షి, హైదరాబాద్ : ప్రియాంకారెడ్డి హత్య మరవకముందే.. శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. శంషాబాద్ సిద్దులగుట్ట దేవాలయం సమీపంలో ఓ మహిళను దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారు. దేవాలయానికి పూజలు చేయడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో మృతురాలు బట్టలు, చెప్పులను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే రక్తపు మరకలను గుర్తించారు. ఇది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన 6.30 నుంచి 7.00 గంటల మధ్యలో జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే మహిళపై పెట్రోలు పోయక ముందే ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. రెండు రోజలు వ్యవధిలో నగర శివారుల్లో రెండు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.