లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్‌, ప్రియాంక పోటీ? | Rahul Gandhi and Priyanka Gandhi Fight in UP Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

UP Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్‌, ప్రియాంక పోటీ?

Published Tue, Dec 19 2023 7:03 AM | Last Updated on Tue, Dec 19 2023 7:03 AM

Rahul Gandhi and Priyanka Gandhi Fight in UP Lok Sabha Elections - Sakshi

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు.  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్‌రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. 

పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 
ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement