
సాక్షి, హైదరాబాద్ : వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతంపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు విచారణ చేపట్టారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో... దీనిపై కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలపై పోస్టింగ్ పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
కాగా నిందితులకు మద్దతు తెలుపుతూ బాధితురాలను కించపరిచేలా స్మైలీ నాని అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పైగా అమ్మాయిలను అత్యాచారం చేస్తే తప్పులేదంటూ నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉదంతంపై యువకులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ పోస్టులు పెట్టుకున్నారు. దీంతో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్‌నాథ్, శ్రవణ్, సందీప్ కుమార్, స్మైలీ నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియాంకా రెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.
చదవండి:
ముందే దొరికినా వదిలేశారు!
Comments
Please login to add a commentAdd a comment