Ishita Gupta files complaint against Bigg Boss 16 participant Priyanka - Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌ బాస్‌ నటిపై తీవ్ర ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు!

Published Mon, Apr 24 2023 4:48 PM | Last Updated on Mon, Apr 24 2023 6:43 PM

Ishita Gupta files complaint against Bigg Boss 16 participant Priyanka - Sakshi

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్‌ డిజైనర్ ఇషితా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి తన డిజైన్లను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే నిర్వహించిన ఓ ప్రదర్శనలో తనకు తెలియకుండానే వాటిని ప్రదర్శించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆమె వెల్లడించారు. 

ప్రియాంక చౌదరి ధరించిన డిజైన్స్ ఓ ఫ్యాషన్ లైన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించామని పేర్కొంది. ప్రియాంక ధరించిన డిజైన్స్‌ న్యూయార్క్ మ్యాగజైన్ కవర్‌ పేజీని కోసం తయారు చేశామని తెలిపింది. అయితే ఇషిత ఆరోపణలపై ప్రియాంకచౌదరి ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియాలో లైక్స్‌ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించింది. అయితే ఇషిత ఆరోపణలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు డిజైన్లు ఒకేలా లేవని చెబుతున్నారు.

కాగా.. ప్రియాంక చాహర్ చౌదరి బిగ్ బాస్- 16 సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ప్రైమ్ టైమ్ టీవీ షో 'ఉదరియాన్' ద్వారా పేరు సంపాదించింది. ఇటీవలే కుచ్ ఇత్నే హసీన్‌లోనూ కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement