![Governor Tamilisai Soundararajan Met Priyanka Reddy Family - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/1/DSC_0065.jpg.webp?itok=za6gQylQ)
ప్రియాంక కుటుంబీకులను ఓదారుస్తున్న గవర్నర్ తమిళిసై
శంషాబాద్ రూరల్: తమ కుమార్తె బుధవారం రాత్రి ‘మృగాళ్ల’దాష్టీకానికి బలై ప్రాణాలు కోల్పోయిన దుస్సంఘటనను తలచుకొని కుమిలిపోతున్న ఆమె తల్లిదండ్రులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై శనివారం ఓదార్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీలో ఉంటున్న వారింటికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తపరిచారు. ఆమెను చూసి బోరున విలపించిన ప్రియాంక తల్లిని గవర్నర్ ఓదార్చారు. బాధితులకు న్యాయం జరిగేలా..నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కేసులో పోలీసులపై వచ్చిన ఆరోపణలను విచారించి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రియాంక కుటుంబీకులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను రాజకీయ అస్త్రంగా నే వాడుకుంటోందనీ.. అదే ప్రజారక్షణ కోసం వినియోగిస్తే ఇలాంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదేమో.. అని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నా రు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసుల అలసత్వం, అభ్యంతరకర మాటలు బాధాకరమని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment