ఆలయంలో జై షా, కుటుంబసభ్యులు
కర్ణాటక: ఎమ్మెల్యేలకు మంత్రులు అస్సలు విలువ ఇవ్వడం లేదు, తక్షణం సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ పెద్దలకు లేఖ రాస్తారు. దానిపై వివాదం ఏర్పడితే.. అబ్బే ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో నకిలీ లేఖను సృష్టించారు, బీజేపీ వారికి ఇదే పని అని ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజుకు మాట మార్చి.. ఆ లేఖ నాదే..అగౌరవాన్ని సహించేది లేదు అని హుంకరిస్తారు. కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తాజాగా ఏమన్నారంటే
లేఖ రాయడంపై క్షమాపణ కోరేది లేదని బీ.ఆర్.పాటిల్ తాజాగా ప్రకటించారు. ఆదివారం కల్బుర్గిలో మాట్లాడిన పాటిల్, ఎవరు క్షమాపణ కోరారో నాకు తెలియదు. సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కోరడం మా హక్కు. కొందరు మంత్రుల ప్రవర్తన అనేకమందికి అసంతృప్తికి కారణమైంది. ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజీనామా చేస్తాను అని పాటిల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో తాను ఎలాంటి క్షమాపణ కోరలేదని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అందరి ముందు చెప్పలేనన్నారు. లేఖ రాయడం నా హక్కు, నేనే రాశాను.అయితే క్షమాపణ కోరలేదు. ప్రియాంక్ ఖర్గేతో అన్ని విషయాలనూ చర్చించాను అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment