PSPK28: Pawan Kalyan Harish Shankar Movie Update - Sakshi
Sakshi News home page

PSPK28:పవన్‌ కల్యాణ్‌ చిత్రంపై మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన

Published Wed, Jun 9 2021 3:29 PM | Last Updated on Wed, Jun 9 2021 6:10 PM

PSPK28: Pawan Kalyan Harish Shankar Movie Update - Sakshi

వైరల్‌ అవుతున్న ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో 28 చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన  ఓ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్‌ బైక్‌పై బ్లాక్‌ షర్ట్‌ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇదే అఫిషియల్‌ లుక్‌ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏ విషయం అయినా తాము అధికారికంగా చెప్పే వరకు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. 

పవన్‌ కల్యాణ్‌ 28వ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ని ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం’మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. 

చదవండి :
ఈ స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటు​న్నారో తెలుసా? 
రామ్‌చరణ్‌తో సినిమా..ఆ డైరెక్టర్‌కు భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసిన 'మైత్రీ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement