గోదావరి నేపథ్యంలో  లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'శశివదనే' | Sasivadane Movie First Look poster Out | Sakshi
Sakshi News home page

Sasivadane: గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'శశివదనే'

Published Sat, Jun 18 2022 4:44 PM | Last Updated on Sat, Jun 18 2022 4:44 PM

Sasivadane Movie First Look poster Out - Sakshi

యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘శశివదనే’.గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ  నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. .ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ  మాట్లాడుతూ..గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రంలో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియ‌ర్‌గా,  హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు రఘు కుంచె, వ్రీమాన్‌, కోమలి ప్రసాద్‌, రంగస్థలం మహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement