Ram Gopal Varma Released First Look Of Aditya T20 Love Story - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆర్జీవీ చేతుల మీదుగా ‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’ ఫస్ట్‌లుక్‌

Published Fri, Jul 22 2022 2:52 PM | Last Updated on Fri, Jul 22 2022 4:20 PM

Ram Gopal Varma Released First Look Of Aditya T20 Love Story - Sakshi

శ్రీ ఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’.ఎంజే క్రియేషన్స్ బ్యానర్ లో బేబీ మన్వితా చరణ్ అడపా సమర్పణలో చిన్నబాబు అడపా నిర్మిస్తున్న  ఈ చిత్రానికి కి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

ఆదిత్య T 20 లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. హీరో శ్రీ ఆదిత్య స్టైలీష్‌‌గా కనిపిస్తున్నాడు. కళ్లజోడు లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.ఈ చిత్రానికి సంగీతం చిన్ని చరణ్ అడపా అందిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement