
బిగ్‌బాస్ ఫేం శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఆవారా జిందగి. దేప శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫన్ ఓరియెంటెడ్ మూవీగా యూత్ ఫుల్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వదిలారు. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు.
నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అన్నది ట్యాగ్‌లైన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.
Comments
Please login to add a commentAdd a comment