కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్‌ లుక్‌ చూశారా? | Kannappa Movie: Aishwarya Bhaskaran Look Out | Sakshi
Sakshi News home page

Kannappa Movie: భయపెడుతోన్న ఐశ్వర్య లుక్‌

Published Mon, Sep 23 2024 8:17 PM | Last Updated on Mon, Sep 23 2024 8:17 PM

Kannappa Movie: Aishwarya Bhaskaran Look Out

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్‌ చేస్తూ, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తూ ఇలా ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్‌ విడుదల చేశారు.

గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement