
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41(Suriya 41) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్. 2డి ప్రొడక్షన్‌లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్‌ను డైరెక్టర్ బాల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం(జూలై 11న) డైరెక్టర్ బాల బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను వణంగన్(తెలుగలో అచలుడు)గా ఖరారు చేశారు. ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సూర్య చిరిగిన గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు.
చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి
ఈ సినిమాలో సూర్య మత్స్యకారునిగా కనిపిస్తాడని మూవీ వర్గాలు అంటున్నాయి. కాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య- డైరెక్టర్ బాలా కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరూ గతంలో నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో కలిసి పనిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్లో చియాన్ విక్రమ్ కూడా నటించాడు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్‌కు ఉత్తమ నటుడుగా, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా పురస్కారం దక్కింది.
చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్
Comments
Please login to add a commentAdd a comment