
Anupama Parameswaran Launch First Look Of The Story Of A Beautiful Girl: చార్మీతో ‘మంత్ర’, అనుపమ పరమేశ్వరన్‌తో ‘బటర్ ఫ్లై’ చిత్రాలు నిర్మించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై రానున్న తాజా చిత్రం ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’. నిహాల్ కొదాటి, దృషికా చందర్ జంటగా రవిప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను అనుపమా పరమేశ్వరన్ విడుదల చేశారు.
‘‘మా బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా 2007లో ‘మంత్ర’ సినిమా చేశాం. అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ‘బటర్ ఫ్లై’ సినిమా చేశాం. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’కి నేను స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశాను. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు అందిస్తాం’’ అని రవిప్రకాష్ బోడపాటి అన్నారు. త్వరలో ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ప్రసాద్ తిరువల్లూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment