రజిత్ సీఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సికాడా. ఈ చిత్రం ద్వారా శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
రోటీన్‌గా కాకుండా ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందే అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సికాడా చిత్రంలో అందరూ కొత్తవారే నటించడం విశేషం.
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్ గతంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా "కాదల్ ఎన్ కవియే", "నెంజోడు చేరు" వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment