టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం 'గామి'. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా విద్యాధర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
నిర్మాణ సంస్థ ట్వీట్‌లో రాస్తూయ..'అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే. ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ.. అతని అతిపెద్ద భయాన్ని జయించటానికి ప్రయాణం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లకు రానుంది.
కాగా.. ఈ సినిమాను ఉద్దేశించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కష్టపడుతున్నానని తెలిపారు. తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని హిమాలయాలు, వారణాసి లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించినట్లు వివరించారు. కథ విషయంలో డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని విశ్వక్ సేన్ తెలిపారు.
#Gaami - 𝗛𝗶𝘀 𝗯𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗳𝗲𝗮𝗿 𝗶𝘀 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵. 𝗛𝗶𝘀 𝗱𝗲𝗲𝗽𝗲𝘀𝘁 𝗱𝗲𝘀𝗶𝗿𝗲 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼, 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵 ☯️
A unique tale of one man and his journey to conquer his biggest fear 🧿
In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv— UV Creations (@UV_Creations) January 28, 2024
Comments
Please login to add a commentAdd a comment