Young hero
-
యంగ్ హీరోతో రీతూ చౌదరి 'న్యూ బిగినింగ్' (ఫొటోలు)
-
అఘోర పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో.. భయపెడుతోన్న పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం 'గామి'. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా విద్యాధర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. నిర్మాణ సంస్థ ట్వీట్లో రాస్తూయ..'అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే. ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ.. అతని అతిపెద్ద భయాన్ని జయించటానికి ప్రయాణం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లకు రానుంది. కాగా.. ఈ సినిమాను ఉద్దేశించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కష్టపడుతున్నానని తెలిపారు. తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని హిమాలయాలు, వారణాసి లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించినట్లు వివరించారు. కథ విషయంలో డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని విశ్వక్ సేన్ తెలిపారు. #Gaami - 𝗛𝗶𝘀 𝗯𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗳𝗲𝗮𝗿 𝗶𝘀 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵. 𝗛𝗶𝘀 𝗱𝗲𝗲𝗽𝗲𝘀𝘁 𝗱𝗲𝘀𝗶𝗿𝗲 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼, 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵 ☯️ A unique tale of one man and his journey to conquer his biggest fear 🧿 In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv — UV Creations (@UV_Creations) January 28, 2024 -
జెట్టీలో ఉన్న సీన్లు క్రాక్ మూవీలో చేయాలనుకున్నారు: హీరో
మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ► నా పేరు కృష్ణ, స్వస్థలం చిత్తూరు జిల్లా. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్ కోసం ఒక ఎపిసోడ్... ఓ సీరియల్లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. అయితే తెచ్చుకొన్న డబ్బులు అయిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శిల్పకళా వేదికలో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి కోట శ్రీనివాసరావుతో ఫోటో దిగడానికి ప్రయత్నించాను. అప్పుడాయన ఇంటికి పిలిచి.. ముందు డిగ్రీ చదువుకో, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ► డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. ఇదిలా ఉంటే నా బావ.. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ► చెన్నైలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూ.. ఆర్గన్ డొనేషన్, ఇతర సోషల్ వర్క్ చేసేవాడిని. నా సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేశ్‌బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల్లో ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. కానీ నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయింది. ► నా తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. నేను టెన్షన్ పడిపోయాను. అలాంటి సమయంలో జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారు. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. మేము కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సాగుతుంటాయి. ► జెట్టీ సినిమా నవంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. జెట్టీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లు తీయలేకపోయాం. జెట్టీలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు. దాంతో జెట్టి సినిమాపై మాకు మంచి నమ్మకం కలిగింది. ► ప్రస్తుతం జెట్టితోపాటు నా మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో ఓ మంచి సినిమా ఆఫర్ వచ్చింది. నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దం. మంచి నటుడిగా గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్. నేను సొంతంగా 100 పైపర్స్ అనే సినిమా కథను రాసుకొన్నాను. నేటి సమాజంలో ప్రేమలు, బ్రేకప్స్ లాంటి అంశాలతో కథ ఉంటుంది. తమిళ సినిమా తర్వాత నేను నా కథను సెట్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. చదవండి: అనసూయ అరిపై నెట్‌ఫ్లిక్స్ గురి బాలాదిత్యపై కక్ష, బిగ్‌బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేషన్? -
ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి
బాలీవడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా ఈ మధ్య కాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు, తన స్నేహితుడు మీజాన్ జాఫేరీతో నవ్య ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రిలేషన్‌పై వస్తున్న పుకార్లపై మీజాన్ తండ్రి, నటుడు జావేద్ జాఫేరీ స్పందించాడు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చి ఇంటర్య్వూలో ఆయనకు నవ్య, మీజాన్ల ప్రేమ వ్యవహరంపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నవ్య, మీజాన్‌లు కేవలం స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశాడు. ‘నా కూతురు, నవ్య మంచి స్నేహితురాలు. స్కూలింగ్ నుంచి వారిద్దరూ కలిసే పెరిగారు. ఈ క్రమంలో మీజాన్, నవ్యలు కూడా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరికి కొంతమంది కామన్ ఫెండ్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారంత అప్పుడప్పుడు కలిసి పార్టీలు, షికార్లకు వెళ్లడం చేస్తుంటారు. అది చూసి కొంతమంది వాళ్ల మధ్య రిలేషన్ ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు వినోదం కావాలి. అందుకే మంచి ఫ్రెండ్స్ మధ్య కూడా ఎదో ఉందని పుకార్లు సృష్టించి వారి గురించి చర్చించుకుంటూ వినోదాన్ని పొందుతారు. ఇక చెప్పాలంటే సారా అలీఖాన్, నా కొడుకు(మీజాన్) కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారిద్దరూ కూడా మంచి స్నేహితులే. కలిసి పార్టీలు, విందులకు వెళుతుంటారు. తెల్లవారు జామును 3 గంటల వరకు వారు పార్టీలంటూ బయట తిరుగుతుంటారు. అంటే ఇక అని వారిమధ్య కూడా ఎదో రిలేషన్ ఉన్నట్టా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత నెల నవ్య ఓ రెస్టారెంట్లో కుర్చొని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన పోస్టుపై మీజాన్ ‘వావ్ ఈ ఫొటో ఎవరూ తీశారు. చాలా బాగుంది. ఐ వండర్’ అంటూ కామెంటు పెట్టాడు.. దీనికి నవ్య మీజాన్జీ అనే నా పర్సనల్ ఫొటోగ్రాఫర్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక అది చూసి అందరూ వీరిమద్య ఎదో ఉందంటూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. కాగా మీజాన్ సంజయ్ లీలా బన్సాలీ ప్రోడక్షన్ నిర్మించిన మలాల్ మూవీతో బాలీవుడ్ ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హంగామా-2లో కూడా నటించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో నటి శిల్పా శెట్టి, పరెష్ రావల్. పునిత్ సుభాష్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక న్యూయార్క్‌లోని ఫోర్థామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్’ పేరిట ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను పప్రారంభించింది. అంతేగాక అప్పుడప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు గల కారణాలపై పలు ఆన్లైన్ ప్లాట్‌ఫ్లాంలో చర్చిస్తుంటుంది. (చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్!) (మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు) (వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు) -
ఇద్దరు భామలతో ఉదయ్ రొమాన్స్
తమిళసినిమా: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. గ్లామర్ అంటే హీరోయిన్లే ముందుగా గుర్తుకొస్తారు. అలాంటి హీరోయిన్లు చిత్రంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే కచ్చితంగా ఆ సినిమా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ సాధ్యమైనంత వరకూ ఒకరికి మించిన హీరోయిన్లు తమ చిత్రాల్లో ఉండేలా చూసుకుంటున్నారనిపిస్తోంది. అలాంటి కథలపైనే అభిమానులూ ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. తాజాగా యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కూడా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారనిపిస్తోంది. ఈయన నటించిన నిమిర్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా శీనురామస్వామి దర్శకత్వంలో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకి. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయిన్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దర్శకుడు అట్లీ శిష్యుడు ఈనక్ చెప్పిన కథ నచ్చేయడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోతున్నారని సమాచారం. ఇందులో ఆయనకు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు మేయాదమాన్ చిత్రం ఫేమ్ ప్రియా భవానీశంకర్ కాగా మరొకరు నటి ఇందుజా అని సమాచారం. ఈ చిత్రం తమిళ ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
లవ్ రాజు ఎవరో..!
‘ఐ యామ్ ఇన్ లవ్’. ‘చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం’. ‘నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను’.‘తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్’.‘వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా’. ‘రిస్క్ లేదు. పెద్దలొప్పేసుకున్నారు’. ‘ఆ యంగ్ హీరో పేరడగొద్దు తర్వాత చెబుతాను’. అని సమంత ‘సాక్షి’కి చెప్పేసింది. ఆ లవర్ బోయ్ ఎవరో మీరు చెప్పగలరా? ♦ ‘24’ సినిమాలో కాలం వెనక్కి వెళుతుంది కదా.. మీకలాంటి అవకాశం వస్తే.. మీ లైఫ్‌లో దేన్ని చెరిపేయాలనుకుంటారు? 2012లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్లగలిగితే వాటిని ఎరేజ్ చేసేస్తాను. ♦ ఏంటవి.. ప్రొఫెషనలా? పర్సనలా? రెండు రకాలుగా తీసుకోకూడని డెసిషన్స్ తీసుకున్నాను. ♦ మీలాంటి అందగత్తెలకు ప్రపోజల్స్ బాగానే వస్తాయి. లవ్‌లో పడేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు కూడా.. అప్పుడేమనిపిస్తుంది? ఎవరైనా వచ్చి, నన్ను లవ్‌లో పడేయడానికి ట్రై చేస్తే ఆ విషయం కూడా మనసుకి ఎక్కించుకోనంత బోర్‌గా తయారైపోయాను. ఓల్డ్ అయిపోయాను. వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య నా లైఫ్ నాకే బోరింగ్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లి, పిల్లలు.. ఆ స్టేజ్‌కి వచ్చేశాను. ♦ అయితే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారన్న మాట. అది ఇంకా తెలియదు. కానీ, పెళ్లి స్టేజ్ మాత్రం వచ్చేసింది. ♦ ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉన్నారని టాక్.. నిజమేనా? నిజమే. లవ్‌లో ఉన్నాను. ♦ ఏదీ మళ్లీ చెప్పండి! Yes, I am in love. ♦ పెళ్లి, పిల్లలు.. ఈ లైఫ్ మీద మీ ఒపీనియన్? కచ్చితంగా నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మంచి ఫ్యామిలీ కావాలి. పిల్లలంటే ఇష్టం. హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతుంటే, ‘మనమేం సాధించామని ఇలా అడుగుతున్నారు?’ అనిపిస్తుంది. అయినా నేనేం చేశానని? నా పని నేను చేశాను.. అంతకుమించి ఏమీ చేయలేదు. నన్నెందుకు అందరూ ఇష్టపడుతున్నారో తెలియదు. ♦ సినిమాలు వదిలేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా? నేను సినిమాలు మానను. నా వయసుకి తగ్గ సినిమాలు చేస్తాను. అలాగే, నా కుటుంబ మర్యాదను కూడా కాపాడే సినిమాలే చేస్తాను. అంటే... మ్యారీడ్ స్టేటస్‌కి తగ్గ సినిమాలు చేస్తాను. ♦ ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న అబ్బాయి మీరు సినిమాలు చేస్తే ఒప్పుకుంటారా? కచ్చితంగా ఒప్పుకుంటారు. తనకేం అభ్యంతరం లేదు. ♦ మీ లైఫ్‌లో ఉన్న ఆ రియల్ హీరో ఈ మధ్య పరిచయం అయ్యారా? కాదు.. నాకు చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం. ♦ తనలో ఉన్న క్వాలిటీస్ గురించి? నేను బాగా అల్లరి. ఏ ఎమోషన్ అయినా నాది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఆనందం వచ్చినా తట్టుకోలేను. టెన్షన్ వచ్చినా తట్టుకోలేను. ఆలోచించి మాట్లాడటం అస్సలు తెలియదు. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను. ఆలోచించి మాట్లాడటం, స్టేబుల్‌గా నిర్ణయాలు తీసుకోవడం, పేషెన్స్ అన్నీ ఉన్నాయి. నాకు కావల్సింది కూడా అదే. ♦ ఇన్నర్‌గా మీరు మంచి అమ్మాయి.. సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి.. మీక్కాబోయే భర్త డబ్బులు తగలేస్తావని అనే టైపా? అస్సలు కాదు. నాలాగే తనది కూడా చాలా హెల్పింగ్ నేచర్. సేవా కార్యక్రమాలు చేయమని ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి అబ్బాయి కాకపోతే ఇష్టపడేదాన్ని కాదేమో. ♦ మీ మనసు దోచుకున్న ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది? ఎవరో అడగొద్దు, జస్ట్ కొన్ని నెలల్లో చెప్పేస్తా. ♦ అంతకుముందు లవ్‌లో పడినప్పుడు ట్విట్టర్లో చెప్పారు.. ఈ లవ్‌ని ఎందుకు రహస్యంగా ఉంచేశారు? ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే బయటికి చెప్పలేదు. ఒకసారి సాఫీగా జరగలేదు. నేను హర్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఒకేసారి పెళ్లి గురించి ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాను. ♦ సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారట.. ఏం చేస్తారు? వంట నేర్చుకోవాలనుకుంటున్నా. తింటాను తప్ప వండటం చేతకాదు. నా చుట్టూ ఉన్న అందరికీ వంట వచ్చు. ♦ మరి.. ఆయనకు వచ్చా? ఓ.. నా బాయ్‌ఫ్రెండ్‌కు బాగా వచ్చు. తను చేసి పెడుతుంటే తినడానికి సిగ్గుగా ఉంటుంది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని, వంట నేర్చుకుంటాను. ♦ ఆయన నాన్‌వెజ్ కూడా కుక్ చేస్తారా? చేస్తారు.. నాన్‌వెజ్ చాలా బాగుంటుంది. ♦ దాదాపు ఓపెన్‌గానే మాట్లాడేస్తారు.. ఇలా అయితే ఇబ్బందే కదా? అవును. నేను బయటకు ఏం మాట్లాడుతున్నానో లోపల కూడా అంతే. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒకలా.. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉండలేను. ట్విట్టర్లో కూడా నాకనిపించింది పోస్ట్ చేసేస్తాను. దానివల్ల విమర్శల పాలయ్యాను. ఇలా ఓపెన్ బుక్లా ఉంటాను కాబట్టి, అసహ్యించుకునేవారినీ, అభిమానించే వారినీ సమానంగా పొందగలిగా. అయినా నో ప్రాబ్లమ్. నేను నాలానే ఉంటా. ♦ రియల్ లైఫ్‌లో నటించరన్నమాట? నైన్ టు సిక్స్ యాక్ట్ చేయగలుగుతాను. షూటింగ్‌కి పేకప్ చెప్పాక కూడా నటిస్తే, చివరికి నేనెవర్నో నేనే మర్చిపోతాను. నేనింతే... ఒప్పుకుంటే ఒప్పుకోండి.. లేకపోతే లేదనుకుంటాను. ♦ ఫైనల్లీ ఓ ప్రశ్న.. మీ లవ్ మ్యారేజ్‌ని పెద్దలు అంగీకరించారా? లేకపోతే కొన్ని సినిమాల లవ్‌స్టోరీలా రిస్కులు చేయాలా? నో రిస్క్. పెద్దవాళ్లు ఒప్పుకున్నారు. సో.. లవ్ లైఫ్‌కి శుభం కార్డే అన్నమాట.. యస్ (నవ్వుతూ). సమంతతో నటించిన పెళ్లి కాని తెలుగు యువ హీరోలు వీరే. ఎనీ గెసెస్‌స్స్...! -
యువహీరో కోసం పాట పాడిన కమల్!
నటన, రచన, దర్శకత్వం, గానం, నిర్మాణం.. ఇలా సినిమా పరిశ్రమలోని 24 శాఖలపై మంచి పట్టు సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్. గాయకునిగా ఇప్పటివరకూ కమల్ తాను నటించిన చిత్రాలకు చాలా పాటలు పాడారు. తొలిసారి వేరే హీరోకి ఆయన తన గాత్రం అందించారు. రాజ్‌దురై దర్శకత్వంలో తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ (‘కడలి’ ఫేమ్) హీరోగా ‘ముత్తురామలింగం’ అనే చిత్రం రూపొందుతోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో పరిచ య గీతానికి ఓ గంభీరమైన గొంతు కావాలనుకున్నారు ఇళయరాజా. వెంటనే కమల్‌ను సంప్రతించారు. ఇప్పటికే ఇళయరాజా సంగీతంలో పలు చిత్రాలకు పాటలు పాడిన కమల్ ఆయన మీద గౌరవంతో వెంటనే ఒప్పుకున్నారు. కమల్ పాడగా ఈ పాటను ఇటీవల రికార్డ్ చేశారు. -
సంక్రాంతి మూడ్‌లో ఎయిర్ పోర్ట్
సంక్రాంతి పండక్కి రెల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే కాదు ఎయిర్ పోర్ట్‌లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలకు కూడా క్యూలో నిలబడటం తప్పేలా లేదు. ఈ రోజు( మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పరిస్థితి ఎలా ఉందో తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ల ముందు నిలబడి సెల్పీ దిగి ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్‌లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాతో తొలిసారిగా మాస్ ఫార్ములాను ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. Happy holidays airport all in sankranti mood :) pic.twitter.com/caeqne97Lx — Actor Aadi (@Aadi_Offl) January 12, 2016 -
ఎస్మార్ట్లో హీరో నిఖిల్ సందడి
-
ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే
‘హీరోగా, నిర్మాతగా దాదాపు పదేళ్ల ప్రయాణం’... తెలుగు చిత్ర సీమలో ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే. తనే కల్యాణ్‌రామ్. మహానటుడు ఎన్టీఆర్ మనవడైన కల్యాణ్‌రామ్‌కు నిర్మాతల కొరత లేదు. కానీ... బయట సినిమాలను ఎక్కువగా ప్రిఫర్ చేయరాయన. క్వాలిటీ నెపంతో నిర్మాతలతో అతిగా ఖర్చుపెట్టించడం ఇష్టం లేకపోవడమే అందుకు కారణం. నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకోవడానికి కారణం కూడా అదే. నచ్చిన పాత్రలు చేస్తారు. నచ్చినట్లు సినిమా తీస్తారు. దటీజ్ కల్యాణ్‌రామ్. ఇప్పటివరకూ ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ వచ్చిన ఈ నందమూరి అందగాడు... ఇప్పుడు వేగం పెంచారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పటాస్’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఇక రెండో సినిమా ‘షేర్'. చాలా కాలం తర్వాత బయట సంస్థలో కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ఇది. విజయలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై కొమరం వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే... నిర్మాతగా మరో అడుగు ముందుకేసి బయట హీరోలతో కూడా చిత్రాలు నిర్మించడానికి సమాయత్తమయ్యారు కల్యాణ్‌రామ్. అందులో భాగంగానే రవితేజ హీరోగా ‘కిక్’ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. దీనితో పాటు తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రీతిగా కెరీర్‌ని జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తున్నారు కల్యాణ్‌రామ్. నేడు ఆయన పుట్టిన రోజు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఈ యువహీరో... విరివిగా విజయాలందుకోవాలని ఆకాంక్షిద్దాం.