Actor Manyam Krishna Interesting Comments About Jetty Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

కోట శ్రీనివాసరావుగారు ఇంటికి పిలిచి ఆ సలహా ఇచ్చారు: జెట్టీ హీరో

Published Wed, Nov 2 2022 5:41 PM | Last Updated on Wed, Nov 2 2022 6:43 PM

Krishna Manyam About Jetty Movie - Sakshi

మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ మాన్యం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నా పేరు కృష్ణ, స్వస్థలం చిత్తూరు జిల్లా. చిన్నతనంలోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మానేసి హైదరాబాద్ వచ్చాను. దూరదర్శన్‌ కోసం ఒక ఎపిసోడ్... ఓ సీరియల్‌లో మూడు ఎపిసోడ్స్‌లో నటించాను. అయితే తెచ్చుకొన్న డబ్బులు అయిపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శిల్పకళా వేదికలో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి కోట శ్రీనివాసరావుతో ఫోటో దిగడానికి ప్రయత్నించాను. అప్పుడాయన ఇంటికి పిలిచి.. ముందు డిగ్రీ చదువుకో, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ జాబ్స్ చేశాను. కానీ నా మససంతా సినిమాపైనే ఉంది. ఇదిలా ఉంటే నా బావ.. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ.. చెన్నైలో పాండ్యన్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకొన్నాడు. నేను కూడా గల్లా అశోక్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకొన్నాను. అది నా కెరీర్‌కు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది.

చెన్నైలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తూ.. ఆర్గన్ డొనేషన్, ఇతర సోషల్ వర్క్‌ చేసేవాడిని. నా సోషల్ వర్క్ చూసి మా బావ గల్లా జయదేవ్ ఇంప్రెస్ అయి మహేశ్‌బాబు సినిమాలో ఆఫర్ ఇస్తాడేమో అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల్లో ఓ నిర్మాత.. నన్ను చూసి ఓ లవ్ స్టోరి సినిమాలో ఆఫర్ ఇచ్చారు. కానీ నా తొలి సినిమా రిలీజ్ ఆగిపోయింది.

నా తొలి సినిమా రిలీజ్ ఆలస్యమైన సమయంలో.. నేను టెన్షన్‌ పడిపోయాను. అలాంటి సమయంలో జెట్టీ మూవీలో ఆఫర్ ఇచ్చారు. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. మేము కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సాగుతుంటాయి. 

జెట్టీ సినిమా నవంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. జెట్టీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించడానికి ఇటీవల గోపిచంద్ మలినేనిని కలిశాను. మా ట్రైలర్ చూసిన తర్వాత.. క్రాక్ సినిమాలో ఇలాంటి సీన్లు చేయాలని అనుకొన్నాను. కానీ లైటింగ్, సమయం లేకపోవడం వల్ల మీరు తీసిన సీన్లు తీయలేకపోయాం. జెట్టీలో సీన్లు చాలా అద్బుతంగా ఉన్నాయి అని ప్రశంసించారు. దాంతో జెట్టి సినిమాపై మాకు మంచి నమ్మకం కలిగింది.

ప్రస్తుతం జెట్టితోపాటు నా మొదటి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో ఓ మంచి సినిమా ఆఫర్ వచ్చింది. నేను హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్దం. మంచి నటుడిగా గుర్తింపు పొందే పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్టింగ్ విషయంలో రానా, నవీన్ చంద్ర నాకు ఇన్సిపిరేషన్. నేను సొంతంగా 100 పైపర్స్ అనే సినిమా కథను రాసుకొన్నాను. నేటి సమాజంలో ప్రేమలు, బ్రేకప్స్ లాంటి అంశాలతో కథ ఉంటుంది. తమిళ సినిమా తర్వాత నేను నా కథను సెట్స్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.

చదవండి: అనసూయ అరిపై నెట్‌ఫ్లిక్స్‌ గురి
బాలాదిత్యపై కక్ష, బిగ్‌బాస్‌ ముద్దుబిడ్డ ఎలిమినేషన్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement