
ఒకప్పుడు సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రీతూ చౌదరి.

ప్రస్తుతం ఫొటోషూట్స్, షోల్లో పాల్గొంటూ ఎంటర్‌టైన్ చేస్తోంది.

ప్రస్తుత సీజన్ బిగ్‌బాస్‌కి వస్తుందని అన్నారు. కానీ అది రూమర్‌గానే మిగిలిపోయింది.

సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

ప్రముఖ కమెడియన్ శివాజీ రాజా కొడుకు విజయ్ రాజాతో కలిసి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టింది.

'న్యూ బిగినింగ్' పేరుతో రీతూ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ విషయం బయటపడింది.

వీళ్లిద్దరూ కలిసి సుఖా ఫార్మ్ స్టే పేరుతో కొత్తగా బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.

విజయ్ రాజా.. జెమ్, వేయిశుభములు కలుగు నీకు, ఏదైనా జరగొచ్చు తదితర సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏం చేయట్లేదు. ఇప్పుడు రీతూ చౌదరితో కలిసి వ్యాపారంలో అడుగుపెట్టాడు.





