Actor Prithviraj Sukumaran First Look Out From Prabhas Salaar Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Salaar: మొహం నిండా మసి, ముక్కుకి పుడక..‘సలార్‌’ విలన్‌ని చూస్తే గూస్‌ బంప్సే..

Published Sun, Oct 16 2022 11:42 AM | Last Updated on Sun, Oct 16 2022 1:24 PM

Prithviraj Sukumaran First Look Out From Prabhas Salaar Movie - Sakshi

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్వీరాజ్‌ కీ రోల్‌ చేస్తున్నారు. నేడు( సెప్టెంబర్‌ 16) పృథ్వీరాజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సలార్‌ నుంచి ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో  ఆయన వరదరాజు మన్నారర్‌ పాత్రలో నటిస్తున్నాడు.  

(చదవండి: ‘కాంతారా’ ప్రభంజనం.. నిర్మాత పంట పండింది!)

లుక్‌ని బట్టి చూస్తే..సలార్ లో పృథ్వీ క్రూరమైన విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖం నిండా మసి పూసి.. ముక్కుకి పుడక, మెడలో వెండి కడియాలు కనిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు కూడా విలన్ పాత్రలో పోషించినా పృథ్వీరాజు సుకుమారే మెయిన్ విలన్ అని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement