దర్శకుడిగా టాలీవుడ్‌ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్! | Tollywood Actor Dhanraj First Movie In His Own Direction, First Look Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Dhanraj Ramam Raghavam Movie: స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న ధన్‌రాజ్‌.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్!

Published Mon, Jan 22 2024 1:31 PM | Last Updated on Mon, Jan 22 2024 3:11 PM

Tollywood Actor Dhanraj First Movie In His Direction Goes Viral - Sakshi

టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్‌ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. 

మేకర్స్ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా  కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement