
శ్రీశైల్ రెడ్డి, భరద్వాజ, సౌద అరుణ్, పమ్మిడి జగదీశ్
ప్రముఖ రచయిత సౌద అరుణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కోడ్ రామాయణ’. ఈ చిత్రంలో సుమారు 50 మంది నూతన నటీనటులు యాక్ట్ చేశారు. సౌద అరుణ్ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌ¯Œ ్సమెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చిన బౌద్ధ భిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా ‘కోడ్ రామాయణ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాత సౌద అరుణ్ మాట్లాడుతూ–‘‘ద్రవిడ భూమి గొప్పతనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవాలనే ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా(కోడ్ రామాయణ, రావణ చరిత్ర, ఉత్తర రామాయణం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రంలో దుర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ–‘‘కోడ్ రామాయణ’ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. ఈ సినిమాని చిరంజీవిగారికి చూపించి, రెండో భాగంలో రావణాసుర పాత్ర చేయమని కోరతాం’’ అన్నారు. నటులు శ్రీశైల్ రెడ్డి, పి.జగదీశ్ పాల్గొన్నారు.