
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది. కన్నడ నుంచి తెలుగు వచ్చిన రష్మిక ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ తన తొలి చిత్రం విడుదల కాకముందే వరుసగా రెండు సినిమాలకు సంతకం చేసింది. ఏకంగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. అమితాబ్‌తో గుడ్‌బై, రణ్‌బీర్ కపూర్ సరసన ఎనిమల్ చిత్రాలు చేస్తుంది. తాజా గుడ్‌బై చిత్రం నుంచి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
రష్మిక మందన్నా శనివారం ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల చేస్తున్న చెప్పింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మీ కుటుంబాన్ని కలిసేందుకు మా నాన్న-నేను అక్టోబర్ 7న వస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌లో అమితాబ్-రష్మికలు కలిసి పతంగులు ఎగురవేస్తూ కనిపించారు. ఈ సినిమాలో రష్మిక అమితాబ్ కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించింది. నీనా గుప్తా, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment