నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని రష్మిక తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది.
(చదవండి: ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!)
‘గుడ్ బై' సినిమాకు గుడ్ బై చెప్పడం నాకిష్టం లేదు. రెండేళ్లుగా కోవిడ్‌తో పాటు ఏదీ కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయాయి. అమితాబ్ బచ్చన్ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ మనిషి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు. నన్ను ఎందుకు ఈ చిత్రంలో తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి.
మీరు గర్వపడేలా ఈ చిత్రంలో నటించానని అనుకుంటున్నాను. నా బేబీ ‘గుడ్‌బై’ని చూసేందుకు అందరు రెడీగా ఉండాలి.. దీని కోసం నేను వేచి ఉండలేకపోతున్నాను’అంటూ రష్మిక తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది
Comments
Please login to add a commentAdd a comment