పట్టు వదలకుండా..! | Ajith Kumar Vidaa Muyarchi First Look Revealed | Sakshi
Sakshi News home page

పట్టు వదలకుండా..!

Published Tue, Jul 2 2024 3:09 AM | Last Updated on Tue, Jul 2 2024 12:05 PM

Ajith Kumar Vidaa Muyarchi First Look Revealed

అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్‌పై మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్‌ హెడ్‌ జీకేఎం తమిళ్‌ కుమరన్‌ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్‌తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 

ఆగస్ట్‌లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement